కెన్యా అడవులకు శర్వానంద్

20-04-2019 Sat 12:07 | Entertainment
  • తెలుగులోకి '96' రీమేక్ 
  • మారిషస్ లో పూర్తయిన షూటింగ్ 
  • కెన్యా అడవుల్లో 15 రోజుల షెడ్యూల్    
శర్వానంద్ కథానాయకుడిగా సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా నిర్మితమైంది. ఈ సినిమా టైటిల్ ను ఇంకా ప్రకటించలేదు. కాజల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, మే 31వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, '96' రీమేక్ షూటింగులో శర్వానంద్ జాయినైపోయాడు.

శర్వానంద్ సరసన సమంత నటిస్తోన్న ఈ సినిమాకి ప్రేమ్ కుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా మారిషస్ లో ఒకటి రెండు రోజులు షూటింగు జరుపుకుని వచ్చింది. తాజా షెడ్యూల్ ను 'కెన్యా' అడవుల్లో ప్లాన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా యూనిట్ అక్కడికి చేరుకోనుంది. 15 రోజుల పాటు అక్కడ ఏకధాటిగా చిత్రీకరణ జరపనున్నట్టుగా తెలుస్తోంది. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తమిళంలో మాదిరిగానే తెలుగులోను ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.
sharwanandsamanta

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more